జగన్‌తోనే రైతుకలు మేలు: వైకాపా
ఏలూరు,జూన్18(జనం సాక్షి): జగన్ ముఖ్యమంత్రి అయితేనే వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యానికి పూర్వ వైభవం సాధ్యమని వైసిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎఎస్ .నాగిరెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రకు స్పందనతో రోజు రోజుకు జగన్ ముఖ్యమంత్రి అవుతారనే అభిప్రాయం బలపడుతుందని అన్నారు. రైతులను వ్యవసాయ సంక్షోభంలోకి నెగ్గిన చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రైతులకు పూర్వ వైభవం సాధ్యమని అన్నారు. రైతుకు కల్తీ విత్యనాలు, నకిలీ ఎరువులతో, సకాలంలో నీరు అందక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధాన్యం ప్రస్తుతం ధర రూ.వెయ్యి ఉండగా ప్రభుత్వం మద్దతు ధరతో రూ. 1,550 ప్రకటించిందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో స్వామినాధన్ కమిటి సిఫార్సులను అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు హావిూలను తుంగలోకి తొక్కారన్నారు. స్వామినాధన్ కమిటీ సిఫార్సుల ప్రకారం క్వింటాళ్లకు రూ. 2850 లు ఉండాలని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫి చేసి , కొదవు పెట్టిన బంగారాన్ని విడిపిస్తామని చెప్పి రైతులను మోసం చేశారని అన్నారు.