జగన్ అరెస్ట్‌తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధంలేదు:సీఎం కిరణ్
అద్దంకి: జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందంలేదని సీఎం కిరణ్ అన్నారు. ఇందిరమ్మ బాటలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా అద్దంకిలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలు చేసినందువల్లే జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిందన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని, రాజకీయా లబ్ధికోసమే పాదయాత్ర చేపట్టారని విమర్శించారు.