జగన్‌ తీరు ఆక్షేపణీయం

మండిపడ్డ మంత్రులు

విశాఖపట్టణం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నేత జగన్‌ లేఖల ద్వారా సానుభూతి పొందాలని చూస్తున్నారని ¬ంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. కాపు రిజర్వేషన్‌పై, అలాగే పవన్‌కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలతో జగన్‌ మైలేజ్‌ తగ్గిపోతోందన్నారు. జగన్‌పై అవినీతి కేసులు ఉన్నాయన్నది వాస్తవం అన్నారు. ఈడీ కేసులో భారతి పేరును చేర్చితే.. చంద్రబాబు బీజేపీతో కుమ్మక్కై చేయించారనడం అర్ధరహితమని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత జగన్‌పై మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. కుటుంబంలోని ఆడవాళ్లను రోడ్డుకు లాగిన జగన్‌.. ఇప్పుడు చంద్రబాబే అందుకు కారణమని ఆరోపించడం తగదన్నారు. తల్లి, చెల్లి, భార్యను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసింది జగన్‌ కాదా? అని నిలదీశారు. వైఎస్‌ విజయలక్ష్మి విశాఖలో ఓడిపోవడానికి జగనే కారణమని చెప్పారు. జగన్‌ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన షర్మిల.. ఇప్పుడు కనిపించకపోవడానికి అందుకు కారణం కూడా జగనే అని వ్యాఖ్యానించారు. అలాగే భారతిపై ఈడీ కేసుల నమోదుకు జగనే కారణమని అయ్యన్నపాత్రుడు తెలపారు.

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించడానికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆస్పత్రివద్ద శనివారం రూ.26.80 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య సేవ కోసం ఆర్థిక భారం ప్రజలపై పడకుండా సీఎం చంద్రబాబు సాయాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.

తాజావార్తలు