జగన్‌ ప్రమాణానికి.. కోట్లు ఖర్చుచేశారు

– టీడీపీ సోషల్‌ విూడియా పేజీలో ఖర్చుల వివరాలు!
అమరావతి, అక్టోబర్‌5 (జనంసాక్షి):  సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో సీసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్‌ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాలనలోనూ తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబులా కాకుండా.. హంగు ఆర్భాటాలు లేకుండా చాలా తక్కువ ఖర్చు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేవలం రూ.29లక్షలు మాత్రమే ఖర్చు చేశామని
చెప్పుకొస్తున్నారు. మరోవైపు జగన్‌ ప్రమాణ స్వీకారానికి ఖర్చుచేసింది రూ.29లక్షలు కాదంటోంది టీడీపీ. వైసీపీ అబద్దపు ప్రచారం చేస్తుందని,  జగన్‌ ప్రచారానికి కోట్లు ఖర్చు అయిందని చెబుతుంది. కేవలం పత్రికల్లో ప్రకటనలకే రూ.5కోట్లు ఖర్చు చేశారని వాదిస్తోంది. ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా తాము వివరాలు సేకరించామని ఆ పార్టీ చెబుతోంది. ఈ మేరకు టీడీపీ సోషల్‌ విూడియా పేజీల్లో ఖర్చుకు సంబంధించిన వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. తాము ఆర్టీఏ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ.5కోట్లు పత్రికల్లో ప్రకటనల కోసం ఖర్చు చేశారని సోషల్‌ విూడియాలో వివరాలను షేర్‌ చేశారు. కేవలం 29 లక్షలతో కార్యక్రమం నిర్వహించినట్లు అబద్దాలు చెబుతున్నారని తేలిపోయిందని, ప్రకటనలకే దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేశారని.. ఇందులో సాక్షికి అత్యధికంగా 2 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని ఆరోపిస్తోంది. అయితే టీడీపీ సోషల్‌ విూడియా పేజీల్లో షేర్‌ చేసిన వివరాలు నిజమా కాదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.