జనంసాక్షి తెలంగాణ ఉద్యమ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కొదండరాం
కరీంనగర్: తెలంగాణ ప్రజల గుండె గొంతుక తెలంగాణ జనంతో ఉద్యమంలో కవాతు చేస్తున్న జనంసాక్షి తెలుగు దినపత్రిక వెబ్‌సైట్‌ను తెలంగాణ ఉద్యమ రథసారథి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రారంభించారు. శనివారం నాడు జనంసాక్షి కార్పొరేట్ కార్యాలయంలో వెబ్‌సైట్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు కోదండరామ్ తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో హరితా బయోటెక్ రసాయన బాధితులను ఆయన పరామర్శించారు. తెలంగాణ పల్లెలపై విషం విరజిమ్ముతున్న రసాయన పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడవల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గ్రామస్తులు పరిశ్రమ మూసివేయించే వరకూ నిరంతరంగా పోరాడినందుకు ఆయన అభినందించారు.