జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో నేను లేను
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి నా సంపూర్ణ సహకారం ఉంటుంది-
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జనగామ (జనం సాక్షి)జూన్28:జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాదులో జులై 2, 3 వ తేదీల్లో జరిగే బీజేపీ జాతీయ సమావేశాలకు వచ్చే ఆ పార్టీ ముఖ్య నాయకులు, ఆయా రాష్ట్రాల సీఎంలను టూరిస్టులుగా భావిస్తున్నాం.తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను బిజెపి పార్టీ కేంద్ర మంత్రులు, సీఎంలు, నాయకులు జిల్లాల వారిగా పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంటు చేసుకోవాలి.సీఎం కేసీఆర్ బి ఆర్ ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆందోళన చెందిన బీజేపీ హైదరాబాద్ వేదికగా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాదును చూసి బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలి. అగ్నిపథ్ కార్యక్రమం రద్దు చేయాలని సికింద్రాబాద్ అల్లర్ల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించి కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహం పేరిట ధర్నాలు చేయడం సిగ్గుమాలిన పని. జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మంచి ప్రజాదరణ ఉంది. ఆయన గెలుపుకు తన సహకారం పూర్తిగా ఉంటుంది.12 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీగా గెలుపొందాను.. అందరి బాగోగులు చూసే వ్యక్తిని. అధిష్టానం దగ్గర వ్యక్తిగా పార్టీ ఆదేశాల మేరకు జనగామలో ఇన్ చార్జిగా పనిచేశా. జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నాయక త్వంలో జనగామ నియోజకవర్గ బ్రహ్మాం డంగా అభివృద్ధి చెందుతుంది.గత 20 ఏళ్లుగా సీఎం కేసీఆర్ తో వెంట నడుస్తూ…అదే క్రమంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తో సైతం తనకు అనుబంధం ఉంది. నాటి తెలంగాణ ఉద్యమంతో పాటు జిల్లా పోరాటం వరకుముత్తిరెడ్డి జనగామ ప్రజలతో మమేకమై ఉన్నాడు. ఎనిమిది ఏళ్ల కాలంలో సైతం ఈ ప్రాంత అభివృద్ధికి ముత్తిరెడ్డి కృషి మరువలేనిది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి నా సంపూర్ణ సహకారం ఉంటుంది. జనగామ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఎవరూ కూడా నమ్మవద్దని వారు ఈ సందర్భంగా అన్నారు.
Attachments area