జనతా ప్రజాస్వామిక విప్లవానికి వ్యవసాయక విప్లవం ఇరుసులాంటిది
ఖిలా వరంగల్ మండలం,జనంసాక్షి(అక్టోబర్20):- దేశంలో జనతా ప్రజాస్వామిక విప్లవం కు వ్యవసాయ క విప్లవం ఇరుసు లాంటిది అని దీని విజయవంతం చేసేందుకు యంసిపిఐయు క్షేత్ర స్థాయిలో వెళ్లి ప్రజా పోరాటాలను నిర్మించాలని ఇందుకు ప్రజా సంఘాల నిర్మాణం అత్యంత కీలకమైన అంశం అని యంసిపిఐయు పోలిట్బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి అన్నారు. ది: 20-10-2022 రోజున యంసిపిఐయు ప్రజా సంఘాల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం వరంగల్ అండర్ బ్రిడ్జి ఓంకార్ భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గోనె కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో ని టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు, వ్యవసాయ, యువజన, విద్యార్థి, మహిళా వ్యతిరేకంగా పాలిస్తూ వారికి హామీ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ఎన్నికల లో కోట్ల రూపాయలు వెదజల్లి, ప్రజలను తాగుబోతులు గా లంచగొండులుగా తయారు చేస్తున్నారు.దేశం ను రాష్ట్రంను అప్పుల ఊబిలో దింపుతూ పాలకులు మాత్రం కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము ను దిగమింగుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యంసిపిఐయు మాత్రం నికరంగా దోపిడీ పాలకవర్గంకు వ్యతిరేకంగా నీతి నిజాయితీ తో నిబద్ధత తో కూడిన కమ్యూనిస్టు విలువలు ఈ సమాజం లో జనతా ప్రజాస్వామిక విప్లవం సాధించటం ద్వారా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి,ప్రజా సంఘాల నాయకులు వరికు ప్పల వెంకన్న పెద్దారపు రమేష్, గోనె కుమారస్వామి,వసుకుల మట్టయ్య, సింగతి సాంబయ్య, వనం సుధాకర్, కుంభం సుకన్య,ఎ హంసా రెడ్డి, కన్నం వెంకన్న, గడ్డం నాగార్జున, కె రాజిరెడ్డి, పల్లె మురళి, వసుకుల సైదక్క, వంగాల రాగసుధ, అంగడి పుష్ప, నర్రా ప్రతాప్ , గుండె బోయిన చంద్రయ్య, నూకల ఉపేందర్ కర్రోళ్ళ శ్రీనువాస్, మానయ్య ,కునుకం సంధ్య, నాగెల్లి కొమురయ్య, మోసిన్ ,కాశి , కిరణ్, తదితరులు పాల్గొన్నారు.