జనరల్ బాడీ సమావేశానికి సర్పంచులు గైర్హాజర్
నాగిరెడ్డిపేట12 అక్టోబర్ జనం సాక్షి :-మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దివిటీ రాజదాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం(జనరల్ బాడీ) బుధవారం నిర్వహించడం జరిగింది.ఈ యొక్క సమావేశానికి మండలంలోని సర్పంచులు గైర్హాజర్ కావడంతో సభలో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.అయినప్పటికీ సర్వసభ్య సమావేశం ఎంపిటిసిల,అధికారుల సమక్షంలో కొనసాగింది.పంచాయతీరాజ్ ఏఈ కృష్ణ ఎజెండా అంశాలను చదివి వినిపిస్తుండగా జెడ్పిటిసి,ఎంపిపి కలుగజేసుకొని మండలంలో నూతనంగా సిసి రోడ్లు ప్రారంభిస్తే ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని,అలాగే స్థానికంగా ఉండకుండా ఇష్టానుసారంగా విధులకు హాజరవుతారని మండిపడ్డారు.ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారులు ఏం చేస్తున్నారని 15 రోజుల క్రితం మండల కేంద్రంలో ఆర్.ఎం.పి,పి.ఎం.పి హాస్పిటల్ మూసివేయడం జరిగిందని వారితో కుమ్మక్కై హాస్పిటల్ ముగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్.ఎం.పి,పి.ఎం.పి హాస్పిటల్లను తనిఖీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఘు,మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్,తాసిల్దార్ సయ్యద్ అహ్మద్ మసూర్,ఎంపిటిసిలు ఉప్పల నారాయణ,మోతే శ్రీనివాస్,మాధవి సంతోష్ గౌడ్,గుర్రాల సుశీల సిద్దయ్య,ఓరా లావణ్య ధర్మవీర్,రామావత్ సుజాత,ఆయా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.