జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ
డిల్లీ: రాబోయే ఎన్నికలకొసం యూపీఏ.2 తురుపుముక్కగా పరిగనిస్తున్న నగదు బదిలి పథకం నూతన సంవత్సరం రోజునుండి ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలోని జిల్లాలలో జనవరి 1న ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శనివారం చెప్పారు. ఆధార్ కార్డ్‌ల సాయంతో ఈ నగదు బదిలీ జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం సబ్సిడీ మీద ఇచ్చే ఆహర దాన్యాలు, ఎరువులు, ఇందన సరఫరాలో అక్రమాలు చోటుచేసుకున్నందున, వాటిని అరికట్టడం కోసం లబ్దిదారులకు ఆ సబ్సిడీల తాలూకు ప్రతిఫలాన్ని నేరుగా నగదు రూపంలో అందించడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. 2013 చివరినాటికి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. ఈ పతకం అమలుపై సంబందిత వర్గాలతో ప్రదాన మంత్రి మన్మోహన్‌సింగ్ సోమవారం ఓ సమావేశంలో చర్చించనున్నారని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఒకింత మందకోడిగా ఉందని , రెండో త్రైమాసికంలో ఆర్థికాభిపృద్ది 5.5 శాతానికి చేరుకుంటుందని ఆశిస్థున్నట్లు చిదంబరం చెప్పారు. తమ లక్షం 8శాతం కాదని, 8శాతం దాటాలన్నదేనని అన్నారు.