జనవరి 23 నుంచి దస్త్రాలు బహిర్గతం చేస్తాం
– మోడీని కలిసిన నేతాజీ కుటుంబసభ్యులు
ఢిల్లీ అక్టోబర్14(జనంసాక్షి):
వచ్చే జనవరి 23 నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన దస్‌ాలను బహిర్గతం చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. నేతాజీ జయంతి సందర్భంగా ఆ రోజు నుంచి ఆయనకు సంబంధించిన దస్త్రాలను బహిర్గతం చేసే పనులు ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. విదేశాల్లో ఉన్న దస్త్రాలను కూడా బయటకు తెచ్చేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలను సంప్రదిస్తామని హామీ ఇచ్చారు.నేతాజీ మృతిపై రహస్యాలు బయటపెట్టేందుకు ఆయన దస్త్రాలను బహిర్గతం చేయాల్సిందిగా ఆయన కుటుంబసభ్యులు బుధవారం ప్రధాని మోదీని కలిశారు. నేతాజీ మరణంపై ఇటీవల కాలంతో వస్తున్న భిన్న కథనాలపై అనుమానాలు నివృత్తి చేయాలని వారు ప్రధానిని కోరారు. నేతాజీకి సంబంధించి రహస్య దస్త్రాలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రధాని మోదీతో పాటు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా నేతాజీ కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీకి నేతాజీ చిత్రపటాన్ని ఆయన కుటుంబసభ్యులు బహూకరించారు.