జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.
అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, అక్టోబర్12,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల కోరిక మేరకు ఈ రోజు 129 వ సారి అన్నదాన కార్యక్రమం దాత సీనియర్ న్యాయవాది లగిశెట్టి శ్రీనివాస్ ద్వితీయ వర్దంతి సందర్భంగా ఎస్ఏ కలీమ్ పాషా మరియు ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 350 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు లగిశెట్టి రాము, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకం శివ, కార్యదర్శి చేను రవి కుమార్, శ్రీనివాస రాజు, జుట్టు రాజన్న, న్యాయవాదులు, జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, కోశాధికారి కోడిపెళ్లి గిరి ప్రసాద్, సహాయ కార్యదర్శి పతంగి సంతోష్, గౌరవ నిచ్చకోల రాజన్న, సభ్యులు కొట్టే రమేష్, బొలిశెట్టి సుధాకర్, కందుల రాజన్న, నిచ్చకోలా గురుస్వామి పాల్గొన్నారు.