జనావాసాల మధ్యనుంచి పరిశ్రమల తొలగింపు

2

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,జులై 16(జనంసాక్షి): స్వచ్ఛ హైదరాబాద్‌, హరిత హైదరాబాద్‌ కోసం చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి దూరం చేసే చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే హుస్సేన్‌ సాగర్‌ కాలుష్యాన్ని తగ్గించిన ప్రభుత్వం పారిశ్రామిక కాలుష్యంపైనా దృష్టి సారించింది. ప్రధానంగా బల్క్‌ డ్రగ్‌ కంపెనీల వల్ల కలుగుతున్న అనర్థాలను గుర్తించింది.  బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమల తరలింపుపై అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమలను ఔటర్‌రింగురోడ్డు పరిధిలోకి తరలిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2017 డిసెంబర్‌ నాటికి అన్ని పరిశ్రమలను తరలిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరం బయటకు వెళ్లే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు తీస్తామని కేటీఆర్‌ తెలిపారు. జనావాసాలకు దూరంగా పరిశ్రమల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ ప్రకటించారు. త్వరలో పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దీంతో పరిశ్రమల కాలుష్యాన్ని దూరం చేసుకోవచ్చన్నారు. నగరం వెలుపలకు వెళ్లే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం బల్క్‌డ్రగ్‌ మాన్‌ఫాక్చరింగ్‌ అసోసియేషన్‌తో మంత్రి సమావేశమయ్యారు. నగరంలో ఉన్న పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌రోడ్డు వెలుపలకు తరలింపుపై సవిూక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక పరిజ్ఞానంతో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1068 కాలుష్యపూరిత పరిశ్రమలను నగరం అవతలికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒకే రంగానికి చెందిన పరిశ్రమలను ఒకే చోట ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఇందుకు సంబంధించి నగరంలోని పరిశ్రమల యజమానులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 2017 డిసెంబర్‌ నాటికి అన్ని పరిశ్రమలను తరలిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.