జపాన్‌లో అణువిద్యుదుత్పాదన పున:ప్రారంభం

టోక్యో:పశ్చిమ జపాన్‌లోని ఓ అణువిద్యుదుత్‌కేంద్రం ఈరోజు పనిచేయడం ప్రారంభించింది.గత ఏడాది పేనుభూకంపం.సునామీల తర్వాత ఆ దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాలన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే.చాలాకాలంపాటు ప్రజల్లో ఈ కేంద్రాల మంచి చెడులపై చర్చలు జరిగాయి.అయితే సురక్షితమైన సిర్థమైన విద్యుత్‌ సరఫరా చేయడానికి అణువిద్యుదుత్పత్తిని అందుబాటులోకి తేవాలనే ప్రభుత్వం నిర్ణయించింది.సీ ఆఫ్‌ జపాన్‌ తీరంలో ఉన్న ఒయ్‌ అణువిద్యుత్‌ కేంద్రాన్ని కన్సాయ్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ నాలుగున్నర నెలల సమయంలో వినియోగంలోకి తెచ్చింది.ఈరోజు పనిచేయడం ప్రారంభించిన ఈ కేంద్రం సోమవారం నుంచీ పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించింది.