జపాన్‌ పర్వతారోహకుడు మృతి

                                                                                   కాఠ్మాండూ,మే22(జ‌నం సాక్షి ):  ప్రపంచంలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎవరెస్ట్‌ను 8వసారి అధిరోహించేందుకు ప్రయత్నించిన జపాన్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు నోబుకాజు కురికి కన్ను మూశారు. గత ఏడు దఫాల ఎవరెస్టు అధిరోహణలో గడ్డ కట్టించే చలి కారణంగా అతను తన రెండు చేతులలోని 9 వేళ్లను కోల్పోయాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పర్వతారోహణలో ఉన్న నోబుకాజు కురికి అత్యధిక చలికి తాళలేక అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతను తన టీమ్‌కు దూరమయ్యారు. 35 ఏళ్ల కురికి ప్రపంచంలో అత్యధిక సార్లు ఎవరెస్టు అధిరోహించి, చివరకు అదే ప్రయత్నంలో కన్ను మూశారు. ప్రస్తుతం 400 మంది సభ్యుల బృందం ఎవరెస్టును అధిరోహించే ప్రయత్నంలో ఉంది.