జమిలి ఎన్నికల లక్ష్యం నెరవేరేనా !
ఇటీవల మరోమారు ప్రధాని మోడీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అదేపనిగా ఎన్నికలు జరిగితే అభివృద్దికి విఘాతం కలుగుతోందన్నారు. నిరంతరాయంగా అభివృద్దికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. గతనెల ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రధాని వన్ నేషన్..వన్ ఎలక్షన్ నినాదాన్ని ప్రజల ముందుంచారు. నిజానికి అదేపనిగా ఎన్నికలు అన్నది కేవలం రాజకీయపార్టీల లబ్దికే తప్ప జాతికి ఉపయోగపడేది ఏవిూ లేదు. ఈ విషయంలో ప్రధాని మోడీ ఆలోచనను సమర్థించాల్సిందే. ఐదు రాష్టాల్ర ఎన్నికలు ముగిసాక రాష్ట్రపతి ఎన్నికలు వస్తాయి. ఆ తరవాత మళ్లీ కొన్ని రాష్టాల్రకు ఎన్నికలు వస్తాయి. ఇలా కాకుండా పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే దఫా ఎన్నికల నిర్వహణ అన్నది మంచిదే. దీంట్లో ఉన్న లోటు పాట్లను సరిదిద్ది ముందుకు సాగితే దేశానికి మేలు చేసిన వారం అవుతాం. అయితే జమిలి ఎన్నికల విధివిధా నాలను ప్రధాని ఎక్కడా సూచన ప్రాయంగగా కూడా వెల్లడిరచడం లేదు. అలాగే దీనిపై చర్చకూడా పెట్డడం లేదు. లేదా పార్లమెంటులో చర్చకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ ఆలోచన మంచిదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో చర్చించాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణచేయాలి. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. ప్రజల్లో కూడా విస్తృతాభిప్రాయం తీసుకుని రావాలి. మేధావులతో చర్చించాలి. ఇవేవీ జరగడం లేదు. గత నాలుగైదేళ్లుగా ఈ విషయంలో కేవలం మాటమాత్రంగానే ప్రకటనలు ఉంటున్నాయి. దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించి జమిలి ఎన్నికల ఆవవ్యకతను ప్రజల్లో చర్చకు తీసుకుని వెళ్లాలి. ముందస్తు ఎన్నికలు జరపడం ద్వారా జమిలి ఎన్నికల లక్ష్యాన్ని నెరవేర్చి రానున్న రోజుల్లో జమిలి ఎన్నికల ఆవశ్యకతను చెప్పాలని ప్రదాని నరేంద్ర మోడీ లక్ష్యంగా ఉంది. ఇప్పటికే ఐదు రాష్టాల్ర ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే రెండు తెలుగు రాష్టాల్రతో పాటు కేంద్రంలోనూ త్వరలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ దశలో వీటన్నింటిని కలుపుకుని నవంబర్ లేదా డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లడానికి నరేంద్రమోడీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం దీనికి కారణంగా చెబుతున్నారు. రాజకీయాలు తారుమారు కాకుండా అనువుగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సిద్దంగా ఉన్నారు. అందుకే ఇక్కడా ముందస్తు సవాళ్లు వస్తున్నాయి. ఇవన్నీ ఓ పద్ద ప్రకారం జరుగుతన్నట్లుగా ఉన్నాయి. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం లోక్‌సభకు సాధారణ ఎన్నికలు 2024 మే నెలలో జరగాల్సిఉంది. అన్ని రాష్టాల్ల్రోనూ లోక్‌సభతో పాటే ఎన్నికలు నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ రాష్టాల్ర శాసనసభలతోపాటు, లోక్‌సభకూ ఎన్నికలు నిర్వహించడం అన్ని విధాల మేలని బిజెపి అగ్రనేతలు అనుకున్నట్లు తెలిసింది. అదేసమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్రశాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. అందరి లక్ష్యం ముందస్తే అయితే జమిలి ఎన్నికలను నిర్వహించినట్లు అవుతుందన్న భావన లో మోడీ ద్వయం ఉందని సమాచారం. కేంద్రం తో పాటే శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయంచడం కూడా మరో కారణం. నిర్ధేశిత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి సమయం ఉన్నా ఆరు నెలల ముందుకు జరిగితే నష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో నిమ్మిత్తం లేకుండా ఎన్నికల కమిషన్ ఈ విషయమై నేరుగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రకంగా నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నట్లు సమాచారం. అయితే ఎలా ముందుకు వెళ్లాలన్న దానికి ఓ ప్రణాళిక చట్టబద్దత అవసరం. దానికి సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏదైనా
చర్చ చేస్తారా అన్నది చూడాలి. రాజ్యాంగ పరంగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడాలి. అయితే బిజెపి ఇప్పటికే ఈ దిశలో కసరత్తు ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీల ఎన్నికలను కలిపి జమిలిగా నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొవ డానికి పార్టీల నేతలు సిద్ధం కావాలి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన గట్టి పట్టుదలగగానే ఉన్నట్లు అర్థం అవుతోంది. అన్ని సిద్దం చేసుకున్న తరవాత ముందస్తు ఎన్నిక లపై స్పష్టమైన సంకేతాలు ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్‌డిఎలోని ఇతర భాగస్వామ్య పార్టీలు కూడా జమిలి ఎన్నికలపై ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అలాగే ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిని నియమించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు ఎన్‌డిఎలోని భాగస్వామ్య పార్టీలకు, మిత్రులకు కూడా సమిలి ఎన్నికలపై అభ్యంతరాలు ఉండకపోవచ్చు. జమిలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బిజెపి నేతలు కూడా తమ అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం గట్టిగా వ్యవహరించి మళ్లీ ఇమేజ్ సాధించాలని చూస్తోందన్న ప్రచారం కూడా ఉంది. దీనిని ఉపయోగించుకుని దేశ వ్యాప్తంగా జాతీయ భావాన్ని పెంపొందించాలని చూస్తున్నారు.
దేశంలో సరిహద్దులు భద్రంగా ఉండాలని సగటు పౌరుడు కోరుకుంటున్నారు. సరిహద్దుల్లో కాల్పుల మోత, సైనికుల ప్రాణత్యాగం కూడా పౌరులను కలచి వేస్తోంది. కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా పాక్‌కు గట్టి బుద్ది చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది జరిగితే బిజెపికి లాభంగా మారనుంది. అందుకు దేశంలో రాష్టాల్ల్రో బలమైన ప్రభుత్వాలు రావాలి. అప్పుడు జమిలికి వెళ్లినా మళ్లీ మోడీ సర్కార్‌కు ఢోకా ఉండదని కూడా భావిస్తున్నారు. జమిలితో దేశంలో ఒకేదఫా ఎన్నికలు జరగాలన్న బిజెపి ఆలోచనను ఇప్పటికే ప్రతిపక్షాలు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇది అసాధ్యమన్న భావనలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. దీనికి రాజ్యాంగం అనుమతించదని సాకు చూపుతున్నారు. మోడీ ఆలోచన బలంగా ఉంది కాబట్టే ఆయన పదేపదే సమయం వచ్చినప్పుడు దీనిని ప్రస్తావిస్తున్నారు. అలా కాకుండా కార్యాచరణ సిద్దం చేస్తే మంచిది. ఒకేదఫా ఎన్నికలతో దేశంపై ఖర్చుల భారం కూడా తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది.