జమైకా టెస్ట్: 260 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
జమైకా: జమైకాలో శుక్రవారం నుంచి ఆరంభమైన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి ఆతిధ్య వెస్టిండిస్ ఫీల్డింగ్ ఎంచుకొంది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ టాపార్డర్ విఫలమవ్వడంతో కష్టాల్లో పడ్డ న్యూజిలాండ్‌ను గుప్తిల్(71), కెప్టెన్ టేలర్(60)లు అర్దసెంచరీలతో రాణిచండంతో 260 పరుగుల వద్ద ఆలౌటైంది. వెస్టీండిస్ బౌలర్లలో రోచ్ నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ భరతం పట్టగా బెస్ట్, డియోనారైన్‌లు రెండేసి వికెట్లు తీసి సహకారమందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టీండిస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా 11 పరుగులు చేసింది. వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్ గేల్ 1, పావెల్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.