జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయి ధర

కరీంనగర్‌, మే 12: జిల్లాలోని జమ్మికుంట మార్కెట్లో పత్తికి రికార్డుస్థాయిలో ధర పలికింది. అత్యధికంగా క్వింటాలుకు రూ.4760 పలికి రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. మోడల్‌ ధర రూ.4600 కాగా, కనిష్టంగా రూ.4500 ధర పలికింది. ఈ రోజు మార్కెట్‌కు 1500 క్వింటాళ్ల పత్తి వచ్చింది. పత్తికి రికార్డుస్థాయిలో ధర పలకడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కష్టానికి ఫలితం దక్కిందని రైతులు సంతోషంగా చెబుతున్నారు.