జయశంకర్‌ సార్‌ జయంతి నుంచి సమస్యలపై పోరు

1
– కోదండరామ్‌

హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి): రాష్ట్రంలోని సమస్యలపై పోరాటానికి తెలంగాణ జేఏసీ సిద్ధమౌతోంది. ఉద్యోగుల సమస్యలతో పాటు రాస్త్ర రైతాంగం ఎదుర్కోంటున్న సమస్యలపై ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి పని చేయాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ 81వ జయంతి రోజు (ఆగస్టు 6)న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామని కొదండరాం అన్నారు. హైదరాబాద్‌లో శనివారం తెలంగాణ పోలిటికల్‌ జేఏసీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత సమావేశ తీర్మాణాలను కొదండరాం విూడియాకు తెలిపారు. ఈనెల 3న ఉస్మానియా ఆస్పత్రిని సందర్శిస్తామన్నారు. ఆ తర్వాత మా నిర్ణయం చెబుతామని కోదండరామ్‌ అన్నారు. గోదావరి జలాల వినియోగం, హైకోర్టు విభజన, ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల విభజనపై చర్చించామన్నారు. ఉద్యోగులు, ఆస్తుల విభజన ఆలస్యంపై నిరసన వ్యక్తం చేశారు.