జయహో రామన్న సాంగ్ సిడి ని ఆవిష్కరించన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కంటోన్మెంట్ జనం సాక్షి జులై 23 తెలంగాణ రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటు, ఐటి రంగ అభివృద్ధి కి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎంతో కృషి చేశారని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మారేడుపల్లెలోని తన నివాస కార్యాలయంలో సిడి ని ఎన్నారై చాడ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన జయహో రామన్న సాంగ్ ను ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కుమార్, ప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నారై బిగాల మహేష్ గుప్తా లతో కలిసి సీడీ ని ఆవిష్కరించారు. పూర్తి సాంగ్ ను వీక్షించిన అనంతరం సృజన్ రెడ్డిని అభినందించారు.ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ
కేటీఆర్ దేశానికి గర్వకారణం అని తెలంగాణకు ముద్దుబిడ్డ అని ఆయన సేవలను కొనియాడారు.ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కెసిఆర్, కేటీఆర్ తెలంగాణ అభివృద్ధికి చూస్తున్నారా అని వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ జీవిత విశేషాలను ఉద్యమ ప్రస్తావాన్ని చిత్రీకరించిన పాటలను వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలను విశ్లేషిస్తూ స్క్రీన్ పై ప్రదర్శించారు.సింప్లీ సిటీ తో ఉంటూ పక్కా ప్లాన్ తో పని చేస్తూ కేటీఆర్ ప్రత్యేక గుర్తింపును సాధించారని అన్నారు. పట్టుదల, కృషి, లక్షాలను సాధించడంలో యువతకు కేటీఆర్ ఆదర్శనీయమని చెప్పారు.దేశ విదేశాలలో విస్తృతంగా పర్యటించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేలా ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివిధ రకాల నూతన పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందిన గొప్ప నాయకుడు.కేటీఆర్ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజావార్తలు