జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు కృషి : టియూడబ్లుజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు, వెంకటరామిరెడ్డి

నాచారం(జనంసాక్షి) : జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టియూడబ్లుజే ఐజేయు అధ్యక్షుడు గడ్డమీద బాలరాజు, ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకటరామిరెడ్డి అన్నారు.  విద్య, వైద్యం పై జర్నలిస్టులకు సహాయం అందజేస్తామన్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్, టియూడబ్లూజే ఉప్పల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో  ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో  శనివారం నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ నికి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. టియూడబ్లూజే ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో  వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. సమన్వయంతో ముందుకు సాగుతూ అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల సత్వర పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు.  జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, జర్నలిస్టు సోదరులు కలిసి రావాలని కోరారు. ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు అందించే సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు. యూనియన్ ఆధ్వర్యంలో త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు.  దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. జర్నలిస్టులకు అందిస్తున్న సేవలను, వాటికి సంబంధించిన సమస్యలపై జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేసి, పూల మొక్కలను అందజేశారు. అదేవిధంగా జిల్లాకు ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నరోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కడియాల రమేష్, సీనియర్ జర్నలిస్టులు కొలనుపాక చంద్రమౌళి శాలివాహన, కిషోర్, శ్రీనివాస్, శ్రీశైలం, యాదగిరి, శివాజీ, సురేష్, శంకర్ , శ్రీనివాస్, నర్సింగ్ , శేఖర్, రాజు, సాంబ, విజయ్, నరేష్ , కుమార్,  సంతోష్, రవీందర్ రెడ్డి, నాగరాజు,  జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టియుడబ్ల్యూజే కార్యవర్గంలోకి ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురికి చోటు కల్పించారు ఉపాధ్యక్షులుగా రాంప్రసాద్ శర్మ,  సంయుక్త కార్యదర్శిగా కే.సి మోహన్, పంజాల శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్యదర్శిగా అక్బర్, ఆదిమూలం శ్రీనివాస్, ఈసీ సభ్యులుగా రమేష్, ఏవి. శ్రీధర్ రావు, సతీష్ ఎన్నికైనారు.