జర్నలిస్టుల కోసం 7న పాస్‌పోర్ట్‌ మేళా

విజయవాడ,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళాను ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన స్లాట్‌ బుకింగ్‌, అవసరమైన పత్రాలు తదితర వివరాలను విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారి శ్రీనివాస్‌ వివరించారు. పాస్‌పోర్టు కావాలను కునేవారు ముందుగా ఎంపాస్‌పోర్ట్‌ యాప్‌లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం 7వ తేదీ శనివారం స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా పాత్రికేయుల కోసమే అందుబాటులోకి తీసుకొచ్చారు. పాస్‌పోర్ట్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకో వాలనుకునే వారు ముందుగా రిజిస్టర్‌ చేసు కోవాలి. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా వివరాలు నమోదు చేయాలి. దీనికి 10వ తరగతి సర్టిఫికెట్‌ కానీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్‌ కానీ ఒరిజినల్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ డాక్యుమెంట్లను శనివారం పాస్‌ పోర్టు కార్యాలయానికి తెచ్చుకోవాలి. పూర్తి చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవాలి. ప్రత్యేకించి పేరు, ఊరి పేరు, చిరునామా నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ పూర్తి చేసిన తర్వాత ఫీజు పోర్టల్‌ ఓపెన్‌ అవుతుంది. ఒక్కొక్కరికి రూ.1500 చెల్లించాల్సిఉంటుంది. డాక్యుమెంట్లు ఒరిజినల్స్‌, జిరాక్స్‌లు తీసుకుని శనివారం పాస్‌పోర్డు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. గతంలో పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకుని తిరస్కరణకు గురై ఉంటే దరఖాస్తు సమయంలో ఆ విషయాన్ని నిర్దేశిర చిన కాలమ్‌లో తప్పకుండా తెలియజేయాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యూనియన్‌ నేతలు కూడా జూచించారు.