జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో ఫీజుల రాయితీ కోసం వినతి
రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 5.(జనంసాక్షి). ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులోరాయితీ ఇవ్వాలని కోరుతూ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. సోమవారం జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ప్రైవేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారని అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అమలు చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ జేఏసీ నాయకులు పాషా, ఉల్లందుల మల్లేశం, జాన దయానంద్, బాబు, హరికృష్ణ, కోడం కనకయ్య, తాటి పెల్లి నరసింహస్వామి, నరేందర్, తదితరులు పాల్గొన్నారు,