జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది

ఎమ్మెల్యే సైదిరెడ్డి              – పత్రికా స్వేచ్ఛను హరించకూడదు                             – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి                            హుజూర్ నగర్ నవంబర్ 27( జనం సాక్షి):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని హుజూర్ నగర్  శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఐజేయు  సూర్యపేట జిల్లా రెండవ మహాసభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుందని తెలిపారు. సహజ మరణం పొందితే లక్ష రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందని  తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ బోర్డుకు 120 కోట్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి తన వంతు కృషి చేయునట్లు  తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులను అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు. ఆరోగ్య కార్డులు ఇప్పించడానికి కూడా తమ వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమాన్ని  గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాత్రికేయుల పాత్ర ఎంతైనా ఉందని అన్నారు. 150 సంవత్సరాల క్రితమే పాత్రికేయులు దేశం కోసం ఎంతో కృషి చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను వెలికి తీయడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డబల్ బెడ్రూం ఇల్లు, ఆరోగ్యకార్డులు ఇవ్వడానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రసంగిస్తూ ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి నేను కృషి చేస్తానని అన్నారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తారని మల్లయ్య యాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యలు తనకు పూర్తిగా తెలుసునని అన్నారు. వారికి సముచితమైన గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మాట్లాడుతూ గతంలో జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ సంఘం నిరంతరం పాత్రికేయుల సమస్యలపై పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు, కార్యదర్శి కోలా నాగేశ్వరరావు, యరగాని నాగన్న, జడ్పిటిసి సైదిరెడ్డి, వక్క వంతుల కోటేశ్వరరావు, ధనుంజయ నాయుడు, నరేందర్ రెడ్డి, స్థానిక పాత్రికేయులు దయాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, టీవీ ఎల్ , దేవర రామ్ రెడ్డి, రాంప్రసాద్, శ్రీనివాసాచారి, దేనమకొండ శేషం రాజు, జానీ పాషా, రామనాథం, అంజయ్య, రామకృష్ణ, దేవర వెంకటరెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు