జర్నలిస్టుల సంక్షేమ నిధికి దరఖాస్తులు చేసుకోండి

1

ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ

హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన జర్నలిస్టుల నుంచి  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మేరకు అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తారు. దీనికోసం దరఖాస్తు  చేసుకోవాలని ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ ప్రకటించారు. దరఖాస్తు చేసుకునే వారు ఆయా జిల్లాల సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లేదా అడిషనల్‌ డైరెక్టర్‌ల ధ్రువీకరణతో ఈనెల 15వ తేదీలోగా ప్రెస్‌ అకాడమి కార్యదర్శికి పంపించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయంతోపాటు ఐదేళ్ల పాటు ప్రతినెల 3 వేల పెన్షన ఇవ్వనున్నట్టు తెలిపారు. పదో తరగతి వరకు వారి పిల్లలకు నెలకు వెయ్యి చొప్పున ట్యూషన ఫీజు కింద చెల్లిస్తామన్నారు. జర్నలిస్టులు అనారోగ్య పరిస్థితిలో ఉంటే వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. జర్నలిస్టు సంక్షేమ నిధి కింద సహాయం పొందాలంటే ప్రింట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ విూడియాలో మూడేళ్ల అనుభవం ఉండాలన్నారు. వర్కింగ్‌ జర్నలిస్టులు దేశంలో గుర్తింపు పొందిన కాలేజీల్లో ఉన్నత విద్య చదివేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద లక్షరూపాయలు, విదేశాల్లో చదివే వారికి 5 లక్షలు ఇస్తామని తెలిపారు.