జహీరాబాద్‌లో పోస్టల్ సిబ్బంది సమ్మె: నిలిచిపోయిన తపాలా సేవలు
మెదక్ : మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ పిలుపు మేరకు నియోజకవర్గంలో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లు(బీపీఎం), పోస్టల్ సిబ్బంది సమ్మెబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విధులు బహిష్కరించారు. దీంతో నియోజకవర్గంలోని 12 సబ్ పోస్టాఫీసులు, 98 బ్రాంచ్ పోస్టాఫీసులు మూత పడ్డాయి. పోస్టల్ సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.