జాతీయపతాకంను ఎగురవేసిన 111 ఏళ్ల వృద్ధుడు
మెదక్: మెదక్ జిల్లా మనూరు మండలం దామరగిద్ద గ్రామంలో 111 సంవత్సరాల వృద్ధుడు మల్కప్ప స్ధానిక చర్చి ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తి పెద్దమనిషిగా ఆయనకు గౌరవమిస్తూ స్థానికులు ఆయన చేత పతాకావిష్కరణ చేయించారు.