జాతీయస్థాయి అక్షర పురస్కారాల ప్రధానోత్సవం
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హల్ నందు శుక్రవారం జరుగనున్న జాతీయస్థాయి అక్షర పురస్కారాల బ్రోచర్ ను జడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ , ఎన్జీవోస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యాస రాంకుమార్ రెడ్డి , జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఉపాధ్యక్షులు శేషరాజుల రవి గురువారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గోపగాని వెంకటనారాయణ మాట్లాడుతూ అక్షర పురస్కారాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్య , వైద్య , క్రీడా,సాంస్కృతిక, పర్యావరణ,పారిశ్రామిక, సాహితీ, కళా, సామాజిక రంగాలలో విశేష సేవలందిస్తూ, సమాజ చైతన్యానికి శ్రీకారం చుట్టిన ప్రతిభావంతులకు, సంస్థలకు అందజేయడం అభినందనీయమని అన్నారు.ఒక వ్యకిని, సంస్థను సన్మానించి ప్రోత్సహించడం వల్ల వారు ఉత్సాహంగా ముందుకెళ్లడానికి దోహదపడుతుందని అన్నారు.బాధ్యత కూడా పెరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ సమజాభివృద్ధికి పోటీపడతారని తెలిపారు.అన్ని రంగాలలో విశేష సేవలందిస్తున్న అక్షర ఫౌండేషన్ ను అభినందించారు.అనంతరం యాస రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విద్య-జీవన విలువలు అనే అంశంపై తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోహి కోటేశ్వరరావు, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ టిపిఎస్ ఉపన్యసిస్తారని తెలిపారు.సినీ డబ్బింగ్ ఆర్టిస్టులు స్వప్న కిషోర్ బృందం, తెలంగాణ జానపద కళాకారులు పౌరాణిక కళాకారులు, వివిధ పాఠశాలల,కళాశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు , ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సన్మాన గ్రహీతల బంధు, మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అక్షర ఫౌండేషన్ సూర్యాపేట , ఎన్జీవోస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ హైదరాబాద్, స్వశోధన్ ట్రస్ట్ హైదరాబాద్, ఆర్వీ ఫెర్టిలిటీ హాస్పిటల్, సూర్యాపేట వారి సౌజన్యంతో ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ అధ్యక్ష , కార్యదర్శులు ఉప్పు నాగయ్య , పాల్వాయి వెంకట్ , పీఆర్టీయు జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు జ్యోతుల చంద్రశేఖర్, చింతరెడ్డి రామలింగారెడ్డి, వీరాసింగ్, మండన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.