జాతీయ అవార్డులు అధికంగా వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ అమలు
జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట కలెక్టరేట్ (జనంసాక్షి): జాతీయ పంచాయతీ అవార్డులు మన జిల్లాకు అధికంగా అందే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జాతీయ పంచాయతీ అవార్డుల దరఖాస్తు తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శ గ్రామాల రూపకల్పనకు కట్టదిట్టమైన చర్యలు చేపట్టామని, జాతీయ పంచాయతీ అవార్డుల దరఖాస్తు సమయంలో మనం చేసిన పనులను పటిష్టంగా తెలిసే విధంగా డాక్యుమెంటేషన్ చేపట్టాలని అధికారులకు సూచించారు2030 నాటికి దేశవ్యాప్తంగా స్థిరమైన గ్రామాలను రూపొందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 9 విభాగాల్లో గ్రామపంచాయతీ పనితీరు పరిశీలించి అవార్డుల జారీ ప్రక్రియ చేపట్టిందన్నారు.పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధి గ్రామం, ఆరోగ్య గ్రామం, చిన్నారుల ఫ్రెండ్లీ గ్రామం, నీరు సమృద్ధిగా ఉన్న గ్రామం , క్లీన్ అండ్ గ్రీన్ గ్రామం, సామాజిక భద్రత కల్గిన గ్రామం, సమృద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామం, సుపరిపాలన గ్రామం, మహిళా ఫ్రెండ్లీ గ్రామం అంశాలలో పనితీరు ఆధారంగా జాతీయ అవార్డుల జారీ ఉంటుందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశానికి సంబంధించి గ్రామాల పనితీరు బేరీజు వేసుకునే వీలుగా ప్రతి విభాగంలో ప్రశ్నలను సిద్ధం చేసుకుందని, వాటి ఆధారంగా గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవార్డుల జారీ ఉంటుందని తెలిపారు.జిల్లాలో ప్రతి విభాగంలో అద్భుత పనితీరు కనబరిచామని, అవార్డుల దరఖాస్తు ప్రక్రియలో, క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో, ప్రశ్నలకు సమాధానం అందించే సమయంలో అప్రమత్తంగా ఉంటూ అధిక సంఖ్యలో జిల్లాకు అందే విధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.గ్రామాలలో చేపట్టిన పచ్చదనం పారిశుధ్యం కార్యక్రమాలు, ఇంటింటికి త్రాగునీరు అందించడం, 24 గంటల విద్యుత్తు, గ్రామాలలో పారిశుధ్యం పచ్చదన కార్యక్రమాలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన సామాజిక భద్రత కల్పించడం, పరిపాలన ,మహిళా ఫ్రెండ్లీ, పిల్లల ఫ్రెండ్లీ గ్రామం, పేదరిక నిర్మూలన మెరుగైన జీవనోపాధి కోసం చేస్తున్న చర్యలను పూర్తిస్థాయిలో తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం ప్రతి విభాగంలో జాతీయస్థాయిలో 3 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తాయని, అదేవిధంగా జాతీయస్థాయిలో 9 అంశాలలో కనబరిచిన పనితీరు కలిపి 3 ఉత్తమ గ్రామాలు ఎంపికవుతాయని పేర్కొన్నారు.మన జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసే సమయంలో మండల జిల్లా పర్ఫామెన్స్ అసెస్మెంట్ కమిటీలు అప్రమత్తంగా ఉంటూ, మంచి గ్రామాలను ఎంపిక చేయాలని, జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం పోటీలో పాల్గొనాలని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం సూచించిన 9 విభాగాల్లో పంచాయతీ పనితీరు పరిశీలించేందుకు బ్లాక్ స్థాయిలో , జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.జాతీయ అవార్డుల సాధనకు ముఖ్యమైన అంశాలు గ్రామాలలో చేపట్టిన పనులను సమర్ధవంతంగా ప్రజెంట్ చేసే వారికి అధిక అవకాశం ఉంటుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన గ్రామాలలో అద్భుత ప్రగతి సాధించామని, వాటిని కట్టుదిట్టంగా ప్రెసెంట్ చేసి అధిక అవార్డులు సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో జడ్పీ సిఈఓ సురేష్ ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, డిడబ్ల్యూఓ జ్యోతి పద్మ , సిపిఓ వెంకటేశ్వర్లు, ఎంపిడిఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఏపిఎంలు , సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|