జాతీయ ఉద్యమంగా మలుస్తాం
– హార్థిక్ పటేల్
న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి) తన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మారుస్తానని గుజారాత్ యువకెరటం, పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న హార్దిక్ పటేల్ హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమంలో మొత్తం తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారని, వారికి 48 గంటల్లోగా నష్టపరిహారం ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇక సూరత్ నుంచి ఒక ప్రకటన వెలువరుస్తానని హెచ్చరించారు. అవసరం అయితే, తన ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళతానని, జంతర్ మంతర్ వద్ద లక్నోలో కూడా నిరసనలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇది 100 విూటర్ల రేస్ కాదని, మారథాన్ అని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న హార్దిక్ పటేల్ ఇతర వర్గాల్లో కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేసే నేతలతో గుజ్జర్లు, జాట్లు తదితరులతో మాట్లాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ సమస్యను తేలిగ్గా చూస్తున్నారని, అదే ఒక ఉగ్రవాది సమస్య అయితే, అర్థరాత్రి అయినా సుప్రీంకోర్టు అయినా అర్థరాత్రి తలుపులు తెరవరా, కావాల్సిన పనులు చేయరా అంటూ నిలదీశారు. దేశంలో 85శాతంమంది పేదవారే ఉన్నారని వారందరికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో ఉద్యమం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అనడం పట్ల స్పందిస్తూ గాంధీ, సర్దార్
పటేల్ వంటి మహనీయులుపుట్టిన నేలపై ఏం జరిగినా దేశానికిగ్భ్భ్రాంతిని కలిగిస్తుందని బాధ కలిగిస్తుందని చెప్పారు.
భవిష్యత్ ప్రణాళికను సిద్దం చేసుకునేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చా భవిష్యత్ ప్రణాళికను సిద్దం చేసుకునేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చినట్లు పటేల్ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న హర్దిక్ పటేల్ స్పష్టం చేశారు. అంతేకాని కేంద్ర మంత్రులను కలవడానికి మాత్రం కాదని ఆయన తెలిపారు. ఆదివారం న్యూఢిల్లీలో హర్దిక్ పటేల్ విలేకర్లతో మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం తాము చేపట్టిన ఆందోళనలో పాల్గొనాలని ఏ రాజకీయ పార్టీని తాము ఆహ్వానించలేదని హర్దిక్ పటేల్ చెప్పారు పటేల్ రిజర్వేషన్ల కోసం జాట్స్, గుజర్ల మద్దతు తీసుకునేందుకు హర్దిక్ పటేల్ బృందం న్యూఢిల్లీ విచ్చేసింది. అందులో భాగంగా ఈ రోజు ఆయా సామాజిక వర్గాల నాయకులతో హర్దిక్ భేటీ కానున్నారు.డనిపబజూ; అయితే నేటి మధ్యాహ్నం 1.00 గంటకు హర్దిక్ పటేల్ విలేకర్లతో మాట్లాడతారని పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్)డనిపబజూ; నాయకుడు దినేష్ పటేల్ వెల్లడించారు. ఢిల్లీ విచ్చేసిన హర్దిక్… న్రరేంద్ర మోదీతో భేటీ ఉండదని తేల్చి చెప్పారు. శుక్రవారం హర్దిక్… పోలీస్ కస్టడీలో మరణించిన శ్వేతాంగ్ పటేల్ నివాసానికి హర్దిక్ వెళ్లాడు. అక్కడ శ్వేతాంగ్ సోదరి హర్దిక్ రాకీ కట్టింది. శ్వేతనాగ్
అంత్యక్రియలు ఆదివారం బాపు నగర్‌లో జరగనున్నాయి. పటేల్‌లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా శ్వేతనాగ్ పటేల్ అనే
వ్యక్తి పోలీసు కస్టడీలో కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో తొమ్మిది మంది పోలీసులపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసును సీఐడీతో విచారణ జరిపించాలని కేసు నమోదు చేయాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వండనిపబజూ; చర్యలకు సిద్ధమవుతోంది.