జాతీయ క్రీడలకు ముహూర్తం ఖరారు
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహణ
గుజరాత్ వేదికగా జరిపేందుకు నిర్ణయం
న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి): దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది చివర్లో 36వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్ వేదికగా జాతీయ క్రీడలు నిర్వహించనున్నట్లు ఐవోఏ ప్రకటించింది. ఈ విషయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. దేశీయ క్రీడల పండుగ నిర్వహణకు అవకాశం కల్పించినందుకు ఐవోఏకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నేషనల్ గేమ్స్ చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జరిగాయి. ఆ తర్వాత పలు కారణాల వల్ల క్రీడా సంబురం వాయిదా పడుతూ వస్తుంది. 2020లో గోవా వేదికగా వీటిని నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో వచ్చే జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ 36వ జాతీయ క్రీడలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 10 వరకు రాష్ట్రంలోని ఆరు నగరాలలో జరగనున్నట్టు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడిరచారు. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావనగర్‌లలో పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. 34 క్రీడాంశాలలో మొత్తం ఏడువేలమంది అª`లథెట్లు క్రీడల్లో తలపడనున్నట్టు తెలిపారు. జాతీయ క్రీడలను చివరిసారి 2015లో కేరళలో నిర్వహించారు. కరోనాతోపాటు వివిధ కారణాలరీత్యా గత ఏడు సంవత్సరాలు గా ఆ క్రీడలు జరగడంలేదు.