జాతీయ గణాంక. పధకాల అమలుపై కేంద్ర మంత్రిత్వ శాఖ సర్వే

యాదాద్రి భువనగిరి బ్యూరో
కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న జాతీయ గణాంక మరియు పథకముల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గృహ వినియోగ వేయ సర్వే ప్రాంతీయ శిక్షణ శిబిరం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రాక్టికల్ శిక్షణ నిమితం అధికారులు శనివారం  సర్వే నిర్వహించారు. దేశ సుతీర అభివృద్ది , ప్రణాళిక బృహ వినియోగ వేగాల తదితర వివరాలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమీక్షా కార్యక్రమానికి  ప్రాంతీయ కార్యాలయ  డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.సతీష్ అధ్యక్ష వహించి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ సర్వే లో ఖచ్చితమైన సమాచారం ఇచ్చి సర్వే నిమితం వచ్చిన అధికారులకు సహకరించి దేశ సుస్తిర ప్రగతికి దోహద పడాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సర్వేకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటటిక్స్ హైదరాబాద్, జి.దయానందం మాట్లాడుతూ భారత ప్రభుత్వం లోని గణాంక మరియు కార్యక్రమాల అమలు మన్త్ర్త్వ శాఖ లోని జాతీయ గణాంక కార్యాలయం 1950 నుండి శాస్త్రీయ నమూనా పద్దతి వినియోగించడం ద్వారా వివిధ విస్తృత, సామాజిక, ఆర్ధిక విషయాల పై దేశ వ్యాప్తంగా సుశీక్షుతులైన కేంద్రీయ సిబ్బంది తో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.
 ఈ శిక్షణ కార్యక్రమంలో  అడిషనల్ డైరెక్టర్ శివ పార్వతి రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బి.మాన్య నాయక్ , డి.డి ఎకనామిక్స్ డి.డి ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ శివ కుమార్, డి.డి ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ యస్, వెంకటేశ్వర్లు, టీ ఎన్ జి ఓ  అస్సోసియేట్  అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, సర్వే సమన్వయ కర్తలు అధికారులు బర్కత్ అలీ, మెండు రమేశ్, రామకృష్ణ, సుధాకర్, భారత్ రాజ్ ,200 మంది ఫీల్డ్ అధికారులు, జూనియర్ గణాంక అధికారులు పాల్గొన్నారు.