జాతీయ స్థాయిలో విద్యార్థి ప్రతిభ

బెల్లంపల్లి పట్టణం: పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఈ నెల 19 నుంచి 22 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి సతక్‌ తక్రా పోటీల్లో బెల్లంపల్లి విద్యార్థి ఎస్కే సుమేర్‌ ప్రతిభ కనబరిచాడు. ఈ పోటీల్లో సుమేర్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలిచిన  సుమేర్‌ను పాఠశాల ధ్రానోపాధ్యాయురాలు ఎ.శారద అభినందించారు.