*జాతీయ స్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించిన మెట్పల్లి కరాటే విద్యార్థులు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 20
(జనం సాక్షి)
తేదీ18.09.2022 ఆదివారం రోజున కోట్ల విజయబాస్కర్ రెడ్డి స్టేడియం హైదరాబాద్ యూసుఫ్ గూడ లో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమి చీఫ్ ఆర్గనైజర్ సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన 15 వ జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీలలో మెట్పల్లి పట్టణ కేంద్రానికి చెందిన జె.కె.ఎ.ఐ షోటోకాన్ కరాటే అసోసియేషన్ జగిత్యాల జిల్లా నుండి 21 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మెట్పల్లి పట్టణముకు కి చెందిన కరాటే విద్యార్థులు కటాస్ విభాగంలో ప్రధమ స్థానంలో 13 బంగారు పతకాలు, ద్వితీయ స్థానంలో 3 వెండి పథకాలు, తృతీయ స్థానంలో 5 కాంస్య పథకాలు సాధించారు. 12 రాష్ట్రాల నుండి 3000 మంది కరాటే విద్యార్థులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కరాటే విద్యార్థులు పోటీలో అత్యంత ప్రతిభ కనబర్చి అత్యధిక బంగారు పథకాలు సాధించిన జిల్లాగా ఓవరాల్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని కైవశం చేసుకొందని మండల ప్రధాన శిక్షకులు మాస్టర్ వంశి నాయుడు తెలియజేసారు. టిఆర్ఎస్ యువ నాయకులు విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు ప్రవీణ్ కుమారుడైన శ్రీరామోజు రిషి కుమార్ అత్యంత ప్రతిభ కనబరిచి ఈ కరాటే పోటీలలో గెలుపొంది బంగారు పతకాన్ని సాధించి మెట్పల్లి పేరు నిలబెట్టారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్, కె. చంద్రగుప్త, ఇ. ప్రకాష్ గౌడ్, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ బి.సైదులు, మండల ప్రధాన శిక్షకుడు వంశీ నాయుడు మాస్టర్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్,కరాటే మాస్టర్లు , పవన్ కళ్యాణ్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.