జాతీయ స్థాయి క్రీడాకారిణి సునితకు ఆర్థిక సహాయం అందజేత
మక్తల్, ఫిబ్రవరి 20( జనంసాక్షి )
జాతీయ స్థాయి క్రీడాకారిణి సునితకు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి. గోపాలం, నారాయణపేట్ జిల్లా షూటింగ్ బాల్ గౌరవ అధ్యక్షుడు, తగ్గా ఆఫ్ వార్ జిల్లా అధ్యక్షుడైన తాను సింగ్ రాజ్ లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. షూటింగ్ బాల్ జాతీయ స్థాయి క్రీడాకారిణి ఊట్కూర్ కు చెందిన కుర్వ సునీత తండ్రి కుర్వ బిస్మప్ప, తల్లి కుర్వ బాలమ్మ కూలి పని చేస్తూ తమ కుటుంబాన్ని పోషించేవారు. కానీ తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆర్థిక పరిస్థితులు, కూతురు చదువుకూ ఇబ్బందికరంగా మారింది. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి. గోపాలం, నారాయణపేట్ జిల్లా షూటింగ్ బాల్ గౌరవ అధ్యక్షుడు, తగ్గా ఆఫ్ వార్ జిల్లా అధ్యక్షుడైన తాను సింగ్ రాజ్ తండ్రిని కోల్పోయిన షూటింగ్ బాల్ జాతీయ స్థాయి క్రీడాకారిణి కుర్వ సునీత చదువుకు ఆటంకం కలగకుండా ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అందజేసి, చదువుకు పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు. సునీత ప్రస్తుతము హైదరాబాద్ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పిఈటి ట్రైనింగ్ చేయుచున్నది. ట్రైనింగ్ పూర్తి కావడానికి పూర్తి ఆర్థిక సహకారం అందిస్తామని తాన్ సింగ్, బి. గోపాలం భరోసా ఇచ్చారు. ఆర్థిక సహకారం అందించిన తాన్ సింగ్ కు, బి.గోపాలం కు జాతీయ స్థాయి క్రీడాకారిణి సునీత కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. శ్రీనివాసులు, సిహెచ్. ఐలయ్య, కోఛు లు, పీఈటీలు, క్రీడాకారులు వారిని అభినందించారు.