జాతీయ స్థాయి జూడో పోటీలు ప్రారంభం
వరంగల్ : వరంగల్ జిల్లా హన్మకొండలోని నెహ్రూ స్టేడియంలో జాతీయ స్థాయి జూడో గ్రేడింగ్ పోటీలను ప్రభుత్వ చీఫ్ వివ్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గండ్ర మంత్రివర్గం నుంచి డీఎల్‌ను తొలగించడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి రాకుండా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి సారయ్య, ఎంపీ రాజయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.