జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి
– డీఐఈఓ రుద్రంగి రవి
సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి):ఆయా ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తున్న జాబ్ మేళాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యాపేట డిఐఈఓ రుద్రంగి రవి అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో హెచ్ సిఎల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఇంటర్ విద్యార్థుల కోసం హెచ్ సిఎల్ కంపెనీ జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయం అన్నారు.అనంతరం ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశులు, తుంగతుర్తి జిజెసి ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పరుగులు తీస్తున్న తరుణంలో హెచ్సీఎల్ కంపెనీ సూర్యాపేటలో జాబ్ మేళా నిర్వహించడం హర్షణీయం అన్నారు.జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ప్రత్యేక దృష్టి సారించడం సూర్యాపేట ప్రాంత విద్యార్థుల అదృష్టమన్నారు.ఈ జాబ్ మేళాలో సుమారు 20 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో ఆరుగురు ఎంపికైనట్లు హెచ్ సిఎల్ కంపెనీ ప్రతినిధి రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజయ్య , శ్రీధర్ , నిరంజన్ రెడ్డి, శ్రీనివాసులు , కృష్ణ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.