జాలర్లను విడిచిపెట్టిన పాక్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి):  బందీగా ఉన్న 173 మంది భారత జాలర్లను పాకిస్థాన్‌ విడుదల చేసింది. వీరు పంజాబ్‌లోని వాఘా సరిహద్దుగుండా భారత్‌లోకి ప్రవేశించారు. ప్రాణాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన సాంత్వనతో జాలర్లు భారత్‌ భూభాగంలోకి ప్రవేశించగానే నుదిటితో నమస్కరిస్తూ భరతమాతకు ప్రణమిల్లారు. పాకిస్థాన్‌కు చెందిన సముద్ర జలాల్లో చేపల వేటకు జాలర్లు వెళ్లిన కారణంగా పాక్‌ సైన్యం వీరిని అదుపులోకి తీసుకుంది. చేపల వేటలో భాగంగా ఇరుదేశాల జాలర్లు పొరపాటుగా నిషేదిత జలాల్లోకి ప్రవేశించడం సర్వసాధారణంగా జరుగుతుంది. దీంతో భారత్‌ వీరిని విడిచిపెట్టాలని చేసిన వినతి మేరకు విడుదల చేశారు.