జిందాల్‌ ఆరోపణలను ఖండించిన ‘జీ’ న్యూస్‌ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

 

ఢిల్లీ : జీన్యూస్‌ జర్నలిస్టులపై కాంగ్రెస్‌ ఎంపీ నవీన్‌ జిందాల్‌ నుంచి ముడుపులు తీసుకున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమని జీన్యూస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అలోక్‌ అగర్వాల్‌ బుధవారం ఢిల్లీలో ఖండించారు. తమ జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమమని ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జిందాల్‌ గ్రూప్‌కు బొగ్గు బావుల కేటాయింపుపై తమ ఛానల్‌ మౌలిక సందేహాలు వ్యక్తం చేసిందని అన్నారు. దీంతో ఈ కుంభకోణం ప్రాధాన్యతను తగ్గించాలని జిందాల్‌ తల్లితమను కోరిందని ఆరోపించారు. నవీన్‌ జిందాలే తమ జర్నలిస్టులకు డబ్బు ఎర చూపారని చెప్పారు. బొగ్గుబావుల కేటాయింపు విషయంలో జిందాల్‌ గ్రూప్‌ గురించి కథనాలు ప్రసారం చేయకుండా ఉండాలని రూ. 100 కోట్లు ఇవ్వాలని జీన్యూస్‌ జర్నలిస్టులు గ్రూప్‌ చైర్మన్‌నవీన్‌ జిందాల్‌ను డిమాండ్‌ చేశారని ఆరోపణ.