జిందాల్ భుముల్లో దుక్కి దున్నిన రైతులు
విజయనగరం: ఎన్‌కోట మండలం జిందాల్ అల్యూమినియం కంపనీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసిత రైతులు శుక్రవారం ఉదయం దుక్కి దున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందుకూరి రఘరాజు ఆధ్వర్యంలో సుమారు 3010మంది రైతులు ర్యాలీగా తరలివచ్చి చెట్లు నరికి దుక్కి దున్నారు. భూ సేకరణ సమయంలో యాజమాన్యం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటంతో తమ భూములు దున్ను కుంటున్నామన్నారు. ఇకనైనా యాజమాన్యం దిగివచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.