జిల్లాలో కందుల కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 20 (): జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజెపి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లాలో కందుల కొనుగోళ్ళ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు నాగేష్‌, నర్సింగ్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం కందులు క్వింటాళ్లుకు 3,900 మద్దతు ధర నిర్ణయించిప్పటికీ కొనుగోళ్లు కేంద్రాలు లేకపోవడం వల్ల ప్రైవేట్‌ వ్యాపారస్తులను ఆశ్రయించి నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. రైతుల సమస్యలను పట్టించుకొని వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జిల్లా వ్యాప్తంగా కందులు కొనుగోళ్లు చేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు.