జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన టిఎస్ పి ఎస్ సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.

-మొత్తం అభ్యర్థులు 8654
–పరీక్షకు హాజరైన వారు 6650
— గైర్హాజరైనవారు 2004 మంది
–హాజరు శాతం 76.84
–.  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ .
సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 16:(జనం సాక్షి):
 జిల్లాలో   తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు.
ఆదివారం జిల్లాలో జరిగిన గ్రూప్-1 ప్రిలీమినరి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు.   సంగారెడ్డి లోని  తార ప్రభుత్వ కళాశాల, కరుణ హై స్కూల్, పటాన్చెరులోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్, ఆర్ సి పురం లోని జిల్లా పరిషత్ హై స్కూల్, సదాశివపేట లో భవిత జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు.
పరీక్షా కేంద్రాలలో బయోమెట్రిక్ విధానం, పరీక్ష నిర్వహణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఆయా పరీక్ష కేంద్రాలలో చీఫ్ సూపర్డెంట్ లను అభ్యర్థుల  హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 జిల్లాలో ఏర్పాటుచేసిన 26 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8654 మంది అభ్యర్థులకు గాను 6650 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 2004 మంది గైరాజరు అయ్యారని పేర్కొన్నారు.76.84  శాతం హాజరు నమోదు అయినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో గ్రూప్ వన్ పరీక్ష ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.