జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి పర్యటన

జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, కూడళ్ల శంకుస్థాపనలుఆరోగ్యశ్రీ సద్వినియోగం చేసుకోండి
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ప్రభుత్వం అనేక కార్యక్ర మాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఆరోగ్య శ్రీ కూడా ఒకటని మంత్రి తెలిపారు. ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉంచేందుకు మరి న్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆసుపత్రిలోని రోగులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు డాక్టర్లు మరింత శ్రద్ధ తీసుకోవాలని కోరామని అన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో పేదరోగులకు ఉత్తమ వైద్యసేవలు
జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రుల్లో పేద రోగులకు ఉత్తమ వైధ్యసే వలందించుటకు అవసరమైన అన్ని మౌళిక వసతులు కల్పించనున్న ట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ది కార్యక్రమా లను మంత్రి ప్రారంభించారు. ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు అతి తక్కువ ధరలో పేద రోగులకు నాణ్యమైన మందులు అందించుటకు ఏర్పాటుచేసిన జనరిక్‌ ఔషద నిలయ మును ప్రారంభించారు. కార్పోరేటు స్థాయిలో నిర్మించిన 20 పడకల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వార్డును, ఐసియు, నీయోనాటల్‌ కేర్‌యూనిట్‌, మ్యాట్రిషనల్‌ రిహబిలిటేషన్‌ సెంటర్‌, సి-ఆర్మ్‌ మిషన్‌, 20 పడకల ఆయుష్‌ ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనరిక్‌ మందుల షాపు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నాణ్యమైన మందులు బయటి షాపుల మందులకన్నా యాబై, ఆరవై శాతం తక్కువ ధరలకు లభిస్తా యన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియా ఆస్పత్రుల్లో జనరిక్‌ షాపు లను ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. 20పడకల ఆరోగ్య శ్రీ వార్డును ప్రారంబించి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అప్పుడే శిశువు జన్మించిన పాపకు ఆరోగ్య సమస్యలు వస్తే సేవలం దించుటకు వీలుగా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఐదుగురు స్పెషలిస్ట్‌ డాక్టర్లను ఆర్థోపె డిక్‌, కంటి, పిల్లల, ఫిజీషియన్‌, జనరల్‌ సర్జన్‌ లను నియామకం చేసినట్లు తెలిపారు. ఇంకా ఖాళీగా ఉన్న ఏడు డాక్టర్‌ పోస్టులను ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రితో మాట్లాడి భర్తీకి కృషి చేస్తామ న్నారు. ఈయన వెంట జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌, ఎంపి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మన్‌ రావు, డిఎంహెచ్‌ఒ నాగేశ్వర్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింగారావు, తదితరులు ఉన్నారు.
పలుకూడళ్లకు మంత్రి శంకుస్థాపనలు
నగర సుందరీకరణకు చేపట్టిన ‘మన నగరం’ కార్యక్రమంలో బాగంగా అభివృద్ది పరుస్తున్న పలుకూడళ్ళను సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రారంబించారు. ఐబి గెస్ట్‌ హౌస్‌, తెలంగాణ చౌరస్తా, బస్టాండ్‌, అంబేద్కర్‌ చౌరస్తా లో అభి వృద్ది పనులను ప్రారంబించి కూరగాయల మార్కెట్‌ దగ్గర 4కోట్ల 28లక్షల 55వేల నిధులతో ఫిల్టర్‌ బెడ్‌నుండి మార్కెట్‌ రిజర్వాయర్‌ వరకు మంచినీటి సరఫరా అభివృద్ది పథకం మెయిన్‌ పైపులైను పనులకు శంకుస్థాపన చేశారు. టవర్‌ సర్కిల్‌లో బిపిఎస్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో 664లక్షల రూపాయలతో రోడ్లు, మురికికాలువల పను లను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  అందరి బాగస్వామ్యంతో ఎంపి, ఎమ్మెల్యేల సహకారంతో నగరంలో ప్రధాన జంక్షన్లు తీర్చిదిద్దినట్లు ఆయన అన్నారు. కూడళ్ళ అభివృద్ది పనులపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.
సుల్తానాబాద్‌లో…
ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మీసేవా
ప్రజలకు విద్యార్థులకు మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశ్యం తోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరన్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మాకంగా తీసు కొని మీసేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారని ప్రతి ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్రపౌరసరఫరాలశాఖ మంత్రి జిల్లా శ్రీధర్‌ బాబు అన్నారు. సోమవారం రోజున మండలంలోని గర్రెపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ స్మితసబర్వాల్‌తో కలిసి ప్రారంభించిన అనంతరం జరిగిన సమావే శంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. మీసేవా కేంద్రాల ద్వారా రైతుల పహాణీలు, పాస్‌బుక్కులు విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు సులభపద్దతిలో తక్కువ సమయంలో తీసుకోవ చ్చని ఆయన స్పష్టం చేసారు.రానున్న రోజులలో అన్ని మండలకేంద్రాలలో సేవాకేంద్రాలను ప్రారం భిస్తామని శ్రీధర్‌బాబు హామి ఇచ్చారు. సభ అధ్య క్షత వహించిన ఎమ్మెల్యే విజయరమణరావు రైతు ల సంక్షేమం దృష్ట్యాడీ 86కెనాల్‌లో షటర్లు మర మ్మత్తులతో పాటు మైకో పత్తివిత్త నాలను అందించాలని మంత్రి దృష్టికి వెళ్లగా మంత్రి శ్రీధర్‌ బాబు స్పందిస్తూ మైకో పత్తి విత్తనాలు జిల్లాకు 71 వేలు మంజూరు కాగా 56 వేలు పంపిణీ చేసినట్లు, ఎస్సారేస్పీ షటర్ల మరమ్మత్తులకు కృషి చేస్తానని గర్రెపల్లి గ్రామంలో ఎక్స్‌ప్రెస్‌ బస్సు అపుటకు ఆర్‌ఎమ్‌తో మాట్లాడుతానని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గర్రెపల్లి గ్రామానికి చెందిన కన్నజాహ్నవి ఐఐటిలో 240ర్యాంకు సాధిం చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆమేను సన్మానిం చారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతు చిత్తూరు, అనంతపురం జిల్లాల తర్వాత కరీం నగర్‌ జిల్లాలో ఇప్పటికి 100కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని అడిగిన వెంటనే ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మీసేవాను ఏర్పాటు చేసినట్లు అన్నారు. గత 6నెలలుగా రెవెన్యూ సిబ్బంది భూరికార్డులు కంప్యూ టీకరణ చేస్తూన్నారన్నారు. పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై జగదీశ్‌లు బందోబస్‌ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో జేసీ, ఎమ్మేల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, అరుణ్‌కుమార్‌, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ మదు సుధన్‌, మాజీ ఎంపీలు రాంరావు, రాములు, మాజీసర్పంచ్‌ రాజే శ్వర్‌రావు, లక్ష్మణ్‌, సంపత్‌, యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు అన్న య్యగౌడ్‌, దామోదర్‌రావు, ఆర్‌ఐలు కిరణ్‌కుమార్‌రెడ్డి, ముజమ్మిల్‌ అహ్మద్‌, ఎంఈఓ రాజయ్య, వీఆర్వోరజనికాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.