జిల్లాలో 11 మంది కారుణ్య నియామకము
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 28 (జనం సాక్షి);
జిల్లా లో కారుణ్య నియమాకం క్రింద 11 మందిని నియమిస్తునట్లు విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందిస్తూ ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వివిధ కారణాలవల్ల తల్లిదండ్రుల ఉద్యోగాలు పిల్లలకు రావడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లాలోని పదకొండు మందికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కారుణ్య నియామక కింద 11 మందికి ప్రోసెడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 11 మంది వివరాలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. వారి ఉద్యోగ అనుభవం టైపింగ్, కంప్యుటర్ వర్క్, రాయడం ,చదవడం వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఏ పని అప్పగించిన బాద్యత యుతంగా పనిచేసి ఉన్నతాధికారుల గుర్తింపు పొందాలని కలెక్టర్ ఆదేశించారు.ఉద్యోగాలు పొందిన వారిలో మేహరునిశా ఉద్యానవన శాఖ, రామాంజనేయులు జిల్లా కోశాదికారి, మొహజీజ్ ఖాన్ ట్రాన్స్పోర్ట్, రోహిత్ నిహాల్ డి పి ఆర్ ఓ , మహర్షి 10 వ బెటాలియన్,ప్రేమకుమార్ సబ్ రిజిష్ట్రార్ , క్రాంతి కుమార్,సి పి ఓ మాధవి లత డి సి ఎస్ ఓ,ఖదీర్ పాషా ఇర్రిగేషన్ రమేష్ బాబు ఎస్ సి.డి డి ఉమామహేశ్వర్ గౌడ్ పోలీస్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్, , ఏ ఓ వీరబద్రప్ప తదితరులు ఉన్నారు.