జిల్లాల్లో కొనసాగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు
చురుకుగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు
ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కలెక్టర్
జనగామ,సెప్టెంబర్13 (జనంసాక్షి): గ్రామాల్లో జరగుతున్న పనులను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పర్యటించి అభివృద్ధి ప్రణాళిక పనులను పరిశీలించారు. పచ్చదనం, పారిశుద్ధ్యం, కనీస మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధుల బృందాల పర్యటనతో ప్లలెల్లో ప్రగతి జాతర సాగుతోంది. 30 రోజుల్లో గ్రామాభివృద్ధికి గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల బృందాలు విస్తృతంగా పర్యటించాయి. గ్రామ గ్రామాన వీధులు, వార్డుల్లో గ్రామ ప్రత్యేక అధికారి నేతృత్వంలో గ్రామ కార్యదర్శి, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, కోఆప్షన్ సభ్యులు పర్యటించి పాడుబడిన బావులు, శిథిలమైన ఇండ్లు, ఎక్కడెక్కడ ఎలాంటి పనులు అవసరమో పరిశీలించి అభివృద్ధి ప్రణాళికలో ప్రతిపాదించి బ్జడెట్ కేటాయించాలి. పలు గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళిక ప్రతిపాదనల్లో సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి సమష్టి నిర్ణయాలతో అభివృద్ధి కార్యాచరణ రూపొందించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో మురికి తుమ్మ చెట్లు, శిథిలమైన ఇండ్లను యంత్రాలతో తొలగించారు. ఏ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.. గ్రామాల్లో వీధిలైట్లు వెలుగుతున్నాయా? లేదా? ప్రమాదకరంగా ఇనుప విద్యుత్ స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వంటి అంశాలను వార్డుల్లో పర్యటిస్తున్న బృందాలు పరిశీలించి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. వేలాడే కరంటు తీగలను గుర్తించి సరిచేయడం, పొడవాటి క్టటెలు, ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయడం వంటి పనులు కొనసాగుతున్నాయి. ఇక హరితహారంలో భాగంగా విలేజ్ నర్సరీని ఏర్పాటుచేయడం, గ్రామాల్లో వీధివీధిలో విరివిగా మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి రక్షించడం, పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవడం, ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి యజమానులు, రైతులతో మాట్లాడి పెద్దఎత్తున చింత మొక్కలు సరఫరా చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పల్లె పాలనను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు రూపొందించిన కొత్త చట్టం ప్రకారం ఇకపై పంచాయతీల్లో భిన్నమైన మార్పులు, చేర్పులతో గ్రావిూణ పాలనపై పర్యవేక్షణ పెరగడంతోపాటు సమస్యల పరిష్కారానికి సులువైన మార్గం ఏర్పడి ప్లలె పరిపాలన పరుగులు పెట్టనుంది.