జిల్లా అంతటా శ్రీరామనవమి వేడుకలు
చెన్నూరు మండంలంలోని సుద్దాల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందమర్రి రామాలయంలో ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఎంపీ వివేక్‌లు దంపతులతో కలిసి సీతారాముల కల్యాణ కన్యాదానాన్ని నిర్వహించారు. చెన్నూరులోని హనుమాన్ ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో నగర సంకీర్తనలు సిర్వహించారు. మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయంలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి భక్తాంజనేయ ఆలయంలో ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మార్వో కిషన్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కత్యాణాన్ని వీక్షించారు. నిర్మల్ బ్రహ్మాపురి దేవాలయంలో వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు రాంకిషన్‌రెడ్డి, మేడారం ప్రదీప్‌లు సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గోన్నారు. ఆలయ నిర్వాహకులు వైభవోపేతంగా కళ్యాణ వేడుకులు కనువిందుగా జరిగాయి. ఉట్నూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం తిమ్మాపూర్‌లో హైకోర్టు న్యామూర్తి చంద్రయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు…



