జిల్లా కలెక్టరేట్ లో మంత్రి హరీష్ రావు ప్రసంగం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) సెప్టెంబర్ 26:
జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ సూచనల మేరకు డిపిఓ సురేష్ బాబు, డిఆర్డీఏ పిడి గోపాల్ రావులు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రసంగాన్ని ప్రోజెక్టర్ ద్వారా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రదర్శించడం జరిగింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగాన్ని శ్రద్ధతో అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపిడివోలు, ప్రత్యేక అధికారులు వీక్షించటం జరిగింది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటికే ముమ్మరంగా పనులు జరుగుతున్న సందర్భంలో అధికార యంత్రాంగం సైతం మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి చతన్యవంతం చేస్తున్నారు. అదే సందర్భంలో జిల్లా అధికారులు, మండల అధికారులకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ యొక్క వీడియో ప్రదర్శించడం జరిగిందని 40 నిమిషాల విడిది గల ఈ వీడియోలో పారిశుధ్యంపై ప్రజలకు అర్ధమయ్యే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడటం జరిగింది. పూర్తిగా విన్న అధికారులు సైతం అద్భుతమైన ప్రసంగాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించడం జరిగిందని అభిప్రాయ పడ్డారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ సూచన మేరకు డిపిఓ సురేష్ బాబు, డిఆర్డీఏ పిడి గోపాల్ రావులు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగాన్ని ప్రోజక్టర్ ద్వారా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రదర్శించడం జరిగింది.
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగాన్ని శ్రద్ధతో వింటున్న అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల ఎంపిడివోలు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.



