జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి ):జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కన్వీనర్, గెజిటెడ్ హెచ్ఏం డాక్టర్ దామెర శ్రీనివాస్ , సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను స్థానిక ఎంజీ రోడ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆ సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరల గడీలను గడగడలాడించిన వీరనారి చాకలి ఐలమ్మ అని ఆమె వీరత్వాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా సహాధ్యక్షులు పొన్నాల నరసయ్య , జిల్లపల్లి పద్మావతి, సహాయ కార్యదర్శి మడిపల్లి కిరణ్, ఆడిట్ కమిటీ కన్వీనర్ జంజిరాల సైదులు, కోశాధికారి రాచకొండ నాగయ్య , చెరుకు సింహాద్రి , తాడూరు అంజయ్య, రాంబాబు, శంకర్, సూర్య, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.