జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ని ఘనంగా సన్మానం.
యాలాల మండలం బీసీ సంఘం లక్ష్మణాచారి.
తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం జిల్లా,గ్రంథాలయ చేర్మెన్ సుశీల్ కుమార్ (రాజు గౌడ్)ను,బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి ఘనంగా సన్మానం చేసారు.ఈ సందర్భంగా లక్ష్మణాచారి మాట్లాడుతూ యాలాల మండలం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాల యాలను ఏర్పాటు చేయాలని కోరారు జిల్లా గ్రంథాల చైర్మన్. రాజు గౌడ్ మాట్లాడుతూ తాండూరులో ఉన్న గ్రంథాలయాన్ని త్వరలో అభివృద్ధి చేస్తామని అన్నారు.యాలాల మండలంలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాల యాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి, ఉద్యమ కారులు ప్రకాష్ గౌడ్, జిలాని, ఉపాధ్యాయులు శాంత్ కుమార్, రాకేష్, బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ గౌడ్, బీసీ నాయకులు విజయ్ కుమార్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.