జిల్లా న్యాయస్థానంలో వైద్యశిబిరానికి స్పందన
కరీంనగర్ న్యాయవిభాగం,న్యూస్‌టుడే: జిల్లా కోర్టులో న్యాయవాదుల వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది.ఐ.ఎం.ఎ.జిల్లా అధ్యక్షుడు,వైద్యుడు బి.ఎన్.రావు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా సదనంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని జిల్లా జడ్జి జయసూర్య ప్రారంభించారు.జిల్లా అదనపు న్యాయమూర్తులు రామకృష్ణయ్య,ప్రసాదరాజు,వాసుదేవరావు,కృష్ణంరాజు,న్యాయసేవా సంస్థ కార్యదర్శి బాలభాస్కర్‌రావు,మేజిస్ట్రేట్ రాజేందర్‌రెడ్డి,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనీల్‌కుమార్,కార్యదర్శి బి.రఘనందన్‌రావు,సభ్యులు నీరుమల్ల శంకర్,రఘువీర్,పి.రాజేందర్ పాల్గొన్నారు.సాయిరాం మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అల్మాన్ తాలీబ్,కృష్ణమూర్తి,పవన్ కుమార్,రజనీకాంత్,సంజయ్‌రాంచంద్ర,లలితారెడ్డి,సాయిప్రాసాద్,రామకృష్ణ పాల్గొని న్యాయమూర్తులు,న్యాయవాదులు,కోర్టు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.సూమారు 300 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా,సాయిరాం ఆసుపత్రి ఫార్మసిస్ట్ పూల్లారి మహోదర్ రావు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.