జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం.

ఏర్గట్ల సెప్టెంబర్ 22 (జనం సాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల  కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గురువారం రోజున జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్వో సుదర్శనం, డాక్టర్ స్టెపిరాని, జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ లు ప్రతి క్లాస్ రూమ్ లో వెళ్లి మాత్రలు వేయడం జరిగినది. అనంతరం డిఎంహెచ్వో మాట్లాడుతూ ఈ మాత్రలు వేసుకోవడం వలన రక్తహీనత ,పోషకాల లోపం ,ఆకలి లేకపోవడం ,బలహీనత , ఆందోళన, కడుపునొప్పి, వికారము, విరేచనాలు, బరువు తగ్గడం, వంటి వాటికే కాకుండా సంపూర్ణ శారీరక, మానసిక అభివృద్ధి కూడా ఈ మాత్రలు తోడ్పడుతయని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమం లో హెచ్ఎం మునిరుద్దీన్,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు , హెల్త్ అసిస్టెంట్ పండరి, ఆశా వర్కర్లు నవ్య ,సరూప తదితరులు పాల్గొన్నారు.